నిత్య మీనన్ ఈమధ్య బాగా లావైపోతోంది.. బొద్దుగా మారుతోంది.. స్లిమ్‌గా ఉంటే బాగుండేది.. ఇలాంటి అభిప్రాయాలు, సలహాలూ ఏమైనా మనసులో ఉంటే వాటిని చెరిపేయండి. ఎందుకంటే.. ఇలా మాట్లాడినవాళ్లందరికీ గట్టిగా కౌంటర్లు ఇస్తోంది నిత్యమీనన్.
నిజంగానే ఈమధ్య నిత్య లావుగా కనిపిస్తోంది. సినిమాలు బాగా తగ్గించేసింది కదా. అందుకే ఫిట్ నెస్‌పై శ్రద్ధ పెట్టడం లేదు. అలాగని `మీరు బాగా లావుగా ఉన్నారేంటి` అని అడిగితే నిత్యకు కోపం వచ్చేస్తోంది. `నా ప్రతిభలో లోపాల్ని కనిపెట్టని వాళ్లే శరీర బరువు గురించి మాట్లాడుతుంటారు` అంటోంది. చిత్రసీమకు కావల్సింద టాలెంట్. అంతే తప్ప ఎత్తూ, బరువు కాదు. కానీ వాటి గురించి ఎవరైనా మాట్లాడితే నేను పట్టించుకోను. నా పని మాత్రమే సమాధానం చెబుతుంది, శరీరాకృతి కాదు.. అని ఘాటుగా బదులిస్తోంది. బరువు గురించి మాట్లాడడం, సలహాలు ఇవ్వడం, ఆరోగ్య చిట్కాలు చెప్పడం కూడా ఓ విధంగా బాడీ షేమింగే అంటోంది నిత్య. ఏదేమైనా.. నిత్యలో చాలా ప్రతిభ ఉంది. వాటిని బయట పెట్టుకునే పాత్రలు మరిన్ని వస్తే మంచిది. బరువు అంటారా... అది నిత్య వ్యక్తిగత విషయం. దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.