నాగబాబు కుమార్తె నిహారిక తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే, హీరోయిన్‌గా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లు చేస్తున్న నిహారిక, ఇటీవల పెళ్ళి చేసేసుకోవడంతో ఇకపై ఆమె సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశమే లేదన్న చర్చ జరుగుతోంది. నిజానికి, నిహారిక విషయంలో మొదటి నుంచీ సోషల్ మీడియాలో కాస్త ‘అతి’ ఎక్కువగానే కనిపిస్తోంది. ఏమాత్రం గ్లామరస్‌గా ఆమె ఫొటోలు కనిపించినా, విపరీతమైన ట్రోలింగ్ మొదలవుతోంది.
అయితే, నిహారిక ఎప్పుడూ అలాంటివాటిని సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని, హద్దులు మీరిన గ్లామర్‌ని కూడా ప్రదర్శించేయలేదు. నటిగా ఆమె తన కెరీర్‌లో మరింత ముందుకు వెళ్ళాలనుకుంటే, అది ఆమె నిర్ణయం.. దాన్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు.. జుగుప్సాకరంగా ఆమెను విమర్శించకపోవడమే సబబు.. అన్నది మెగా అభిమానుల్లో కొందరి వాదన. అయితే, మెగా అభిమానుల పేరుతో నిహారికని గత కొద్ది రోజులుగా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ చిన్న పా్త్రలో కనిపించిన నిహారిక, త్వరలోనే మరో మెగా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుందన్నది తాజా ఖబర్. నిహారిక, అనసూయ ప్రధాన పాత్రల్లో ఓ కొత్త వెబ్ సిరీస్ తాజాగా ప్రారంభమయ్యింది.