ఈ నెల 29న 'సూర్యకాంతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది మెగా డాటర్ నిహారిక. ఈ సందర్భంగా జోరుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆశక్తికరమైన సమాధానాలిస్తోంది. ఈ క్రమంలో నిహారిక పెళ్లి మ్యాటర్ బయటికొచ్చింది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటిస్తుందా.? లేదా.? అనే ప్రశ్నకు నిహారిక క్యూట్ సమాధానమిచ్చింది.
పెళ్లి తర్వాత సినిమాల నుండి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుని, కొంతకాలం పూర్తిగా ఫ్యామిలీకి కేటాయిస్తాననీ, ఆ తర్వాత మళ్లీ నటనను కొనసాగిస్తాననీ నిహారిక చెప్పింది. అయితే నిహారిక పెళ్లెప్పుుడంటే.? ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. ఈ మధ్యనే నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు కూడా నిహారిక పెళ్లి విషయంలో పెదవి విప్పారు. కానీ నిహారిక ఇష్టానికే వదిలేశారు. తనకి కాబోయే అల్లుడు మంచివాడైతే చాలు. కులం, గోత్రంతో సంబంధం లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, నిహారిక నటిస్తున్న తాజా చిత్రం 'సూర్యకాంతం'లో ఓ గయ్యాలీ పిల్లగా నిహారిక నటించింది. రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. మరో నటి బెర్లిన్ కీలక పాత్రలో కనిపించింది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా రాహుల్ విజయ్ పాత్ర యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది. సూర్యకాంతంగా నిహారిక చిలిపి చేష్టలు కడుపుబ్బా నవ్వించేలా ఉండనున్నాయనీ టీజర్, ట్రైలర్స్ ద్వారా ఆల్రెడీ అర్ధమైపోయింది. అంచనాలు బాగానే ఉన్నాయి కానీ, చూడాలి మరి కెరీర్లో మూడో సినిమా అయిన 'సూర్యకాంతం'తో నిహారిక ఎన్ని మార్కులేయించుకుంటుందో.