ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మంచి సన్నిహిత్యం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి సినిమా 'చిత్రం' తర్వాత వచ్చిన 'నువ్వు నేను' సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నుండీ ఉదయ్ కిరణ్‌కి తిరుగే లేకుండా పోయింది. యంగ్ హీరోల్లో ఉదయ్ కిరణ్ అప్పట్లో ఓ సెన్సేషన్. 'మనసంతా నువ్వే' తదితర సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నాడు.
ఎంతో కెరీర్ ఉన్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా ఆత్మ హత్య చేసుకుని చనిపోవడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. అయితే, ఉదయ్‌కిరణ్‌కి పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఉన్నట్లు డైరెక్టర్ తేజకి ముందే తెలుసంట. ఆయన తన కష్టాలన్నీ తేజతో చెప్పుకుని బాధపడుతుండేవారట. అరతకు ముందే ఓ సారి సూసైడ్ అటెంప్ట్ చేశాడట ఉదయ్. డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్‌ని మళ్లీ మనిషిలా మార్చేందుకే ఆయనతో 'ఔనన్నా కాదన్నా' సినిమా తెరకెక్కించారట తేజ. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా నిరాశ పరిచింది.
ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ మరణాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. బలవన్మరణానికి పాల్పడి, జీవితాన్ని అర్ధాంతరంగా అంతం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ చనిపోయినా, అరే ఈ కుర్రాడా.? చనిపోయాడా.? అనే ఆశ్చర్యం కలుగుతుంటుంది ఇప్పటికీ. ఆయన మరణం జీర్ణించుకోలేనిది. తాజాగా ఓ ప్రోగ్రాంలో తేజ, ఉదయ్‌కిరణ్‌తో తనకున్న అనుబంధాన్నిలా అభిమానులతో పంచుకున్నారు. లేటెస్ట్‌గా తేజ కాజల్ అగర్వాల్‌తో 'సీత' సినిమా తెరకెక్కించారు. కానీ ఆశించిన రిజల్ట్‌ని అందుకోవడంలో విఫలమైంది 'సీత'.