సెల్ఫీ పాప మళ్లీ స్మైలిచ్చింది

By iQlikMovies - May 02, 2018 - 16:13 PM IST

మరిన్ని వార్తలు

ఆ మధ్య బికినీల్లో సెల్ఫీలు దిగి, కిర్రాకు పుట్టించేసిన బ్యూటీ నికీషా పటేల్‌ ఎట్టకేలకు ఓ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించేసుకుంది. అదీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ కావడం విశేషం. ఆ సినిమా కోసం తన ఫిజిక్‌కి పర్‌ఫెక్ట్‌ రంగులు అద్దిందీ హాట్‌ భామ. సినిమా ఛాన్స్‌ రావడంతో అంతవరకూ సోషల్‌ మీడియాలో చేసిన హాట్‌ ఎగ్జిబిషన్‌కి కాస్త గ్యాప్‌ ఇచ్చింది. షూటింగ్‌ నుండి కొంచెం టైం దొరికిందట. అందుకే తన హాట్‌ హాట్‌ ఫ్యాన్స్‌ కోసం మళ్లీ అందాల దాడి మొదలెట్టింది. హాట్‌గా సెల్ఫీని క్లిక్‌మనిపించింది. వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంకేం ఆమె ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారంతే. ఏమాటకామాటే చెప్పుకోవాలి. గ్లామర్‌లో నికీషా పటేల్‌ తనకి తానే సాటి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS