కష్టపడకపోతే ఏదీ దక్కదు అంటోంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో స్టార్ హీరోస్‌తో నటించిన స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు నుండి కాస్త గ్యాప్ తీసుకుంది. 'అయ్యారీ' సినిమా కోసం బాలీవుడ్‌కి వెళ్లింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో మళ్లీ తెలుగులో అవకాశాల కోసం తిరిగొచ్చేసింది.
కానీ రకుల్‌కి తగ్గ అవకాశాలు తెలుగులో దక్కకపోవడంతో, కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అక్కడ వరుస ఆఫర్లు రకుల్‌ని వరించాయి. ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్‌తో సినిమా చేస్తోంది. ఈ డైరెక్టర్‌తో అంత ఈజీ కాదని చాలా మంది చెప్పారట రకుల్‌కి. అయితే వాళ్లూ వీళ్లూ కాదు, ఆయనే డైరెక్ట్‌గా చెప్పాడట. నాతో సినిమా అంటే హీరోయిన్స్‌కి అంత ఈజీ కాదని. అయినా కానీ సెల్వరాఘవన్‌లాంటి డైరెక్టర్స్‌తో పని చేస్తే నటనలో ఆరితేరతాం అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతోందట.
అయినా ఆ కష్టంలోనే సుఖం ఉందంటోంది. అలా సెల్వరాఘవన్‌తో సినిమాని ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్ సింగ్. బాలీవుడ్ నుండి వచ్చిన తనకు తెలుగులో మాట్లాడడం కష్టమే. కానీ మాట్లాడుతున్నాను కదా. కష్టపడి నేర్చుకుంటే, ఏదీ అసాధ్యం కాదు. అలాగే త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటాను అని రకుల్ చెప్పింది.