సౌత్‌ సినిమాలు చేయనంటోన్న పవన్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

పవర్‌స్టార్‌తో ‘కొమరం పులి’ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా.. పేరు నికీషా పటేల్‌. ఎంట్రీ ఘనంగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి దక్కాల్సిన ఆఫర్లు దక్కాల్సిన టైమ్‌లో దక్కలేదు. కొండంత సహనంతో ఎదురు చూసింది. కానీ, ఫలితం లేదు. ఎలాగో తమిళంలో ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకున్నా, తెలుగులో మాత్రం అస్సలు ఛాన్సే రాలేదు. ఆఖరికి బికినీ ఫోటో షూట్స్‌తో సోషల్‌ మీడియానీ వీర లెవల్లో హీటెక్కించేసింది. అయినా లాభం నిల్‌. అప్పుడెప్పుడో యాంకర్‌ రష్మి నటించిన ‘గుంటూర్‌ టాకీస్‌’ సీక్వెల్‌లో హీరోయిన్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. కానీ, ఆ సినిమా ఏమైందో ఏమో ఎవ్వరికీ తెలీదు.

 

ఇక ఈ పాప గురించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే, నికీషా పటేల్‌ లండన్‌లోని ఓ ఏజెన్సీ కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుందట. అంటే త్వరలోనే ఈ ‘పులి’ పిల్ల హాలీవుడ్‌లో అదృష్టం చెక్‌ చేసుకోనుందన్న మాట. ఇకపై ఎంత ట్రై చేసినా సౌత్ లో కంటెంట్‌ లేని, ప్రాధాన్యత లేని పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందనీ, ఎన్నో ఆశలతో వచ్చినా, తన ఆశలకు చెల్లు చీటీ పాడేస్తూ, ఇక సౌత్‌లో సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నా.. అని ఆవేదనతో సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేసింది.

నికీషా ట్వీట్‌కి పాపం ఆమె ఫాలోవర్స్‌తెగ ఫీలవుతున్నా, సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా.? ఏంటీ.? అని సరిపెట్టుకుంటున్నారు. అక్కడైనా ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ బాగుండాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం నికీషా పటేల్‌ నటిస్తున్న మూడు తమిళ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS