లేజీ బ్యూటీ - స్విమ్మింగ్‌ హాటీ!

మరిన్ని వార్తలు

బికినీ బ్యూటీ నికీషా పటేల్‌కి కొంచెం బద్ధకం ఎక్కువేనట. అందుకే తనను తాను లేజీగా అభివర్ణించుకుంటుంది. ఈ బద్దకం నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒక పనిని అలవాటుగా పెట్టుకోవాలి కదా. అందుకే ఈ బ్యూటీ కొంచెం కొత్తగా ఆలోచించింది. బద్దకాన్ని జయించేందుకు స్విమ్మింగ్‌ క్లాసులకు వెళుతోందట. స్విమ్మింగ్‌ కోసం మార్నింగ్‌ ఎర్లీగా లేవాల్సి వస్తుందట. దాంతో తన బద్దకాన్ని కొంచెంలో కొంచెం దూరం పెట్టే అవకాశం కలుగుతోందనీ చెబుతోంది. 

స్విమ్మింగ్‌ క్లాసెస్‌కి వెళ్తున్నానన్న సంగతిని ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. స్విమ్మింగ్‌ క్లాస్‌ తర్వాత, ఇదిగో ఇలా సెల్ఫీ దిగి, సోషల్‌ మీడియాలో ఆ ఫొటో పోస్ట్‌ చేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బికినీ సొగసులతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ మొత్తానికి హాట్‌ హాట్‌ ఆఫర్‌నే కొట్టేసింది. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు చేసే ఫీట్స్‌కి అదరహో అని తీరాల్సిందేనట. యాక్షన్‌ ఘట్టాలు ఇరగదీసేయనుందట నికీషా పటేల్‌. ఈ ముద్దుగుమ్మకి అందంతో పాటు, కొంచెం బద్దకం ఉన్నా కానీ, ఎక్స్‌ట్రా టాలెంట్స్‌ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 

మార్షల్‌ ఆర్ట్స్‌లో నికీషాకి నైపుణ్యం ఉందట. ఆ కారణంగానే ఈ సినిమాలో నికీషాకి ఛాన్స్‌ వచ్చిందట. మామూలుగా హీరోయిన్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అంటే డూప్స్‌తోనే చేయించేస్తారు. అయితే నికీషా డూప్స్‌ లేకుండా ఫైట్స్‌ చేసేసిందట ఈ సినిమాలో. చూడాలి మరి ఈ లేజీ బ్యూటీ యాక్షన్‌ మూవీ ఎలా ఉండబోతోందో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS