హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్ ది ఎండ్ గేమ్' పుణ్యమా అని కొండంత ఆశలు పెట్టుకుని ది బెస్ట్ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్న 'అర్జున్ సురవరం'కు తీరని అన్యాయం జరిగింది. హాలీవుడ్ సినిమా కోసం ఓ తెలుగు సినిమా రిలీజ్‌ని వాయిదా వేసుకోవడమనేది ఇంతకు ముందెప్పుడూ తెలుగు సినిమా హిస్టరీలో చోటు చేసుకోని వింత చర్య.
ఇదిలా ఉంటే, ఒకసారి విడుదలకు సిద్ధమైన సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందంటే, ఆ తర్వాత ఆ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు 'అర్జున్ సురవరం' పరిస్థితి చూస్తే అర్ధం చేసుకోవచ్చు. మే 9న సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'మహర్షి'గా వస్తున్నాడు. ఇక తర్వాతి వారం 'ఎబీసీడీ' అంటూ మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాతి వారం 'సీత'తో కాజల్ రెడీగా ఉంది. ఇలా ఈ నెల్లో అన్ని సినిమాలూ స్లాట్ బుక్ చేసుసుకున్నాయి. మరి నిఖిల్ పరిస్థితేంటీ. అన్నీ పూర్తి చేసుకున్న సినిమా ఒక్క వారం వాయిదా పడితేనే నిర్మాతల కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో మీకేం అర్ధమవుతాయిలెండి మా సినిమావోళ్ల కష్టాలు అందుకే వీలైనంత తొందర్లో స్లాట్ బుక్ చేసుకోవాలి తప్పదు.
ఇక నిఖిల్‌కి ఉన్న ఒకే ఒక అవకాశం. మహేష్‌ని ఎలాగూ నిఖిల్ టార్గెట్ చేయలేడు. ఇక మిగిలింది అయితే అల్లు వారబ్బాయ్ లేదంటే, 'సీత' కాజల్. ఈ ఇద్దరిలోనూ ఎవరో ఒకర్ని 'అర్జున్ సురవరం' టార్గెట్ చేయక తప్పదు. ఆ దిశగానే నిఖిల్ అండ్ టీమ్ కసరత్తులు చేస్తున్నారట. మరి, పాపం సోలో ఎంట్రీ ఇవ్వాలనుకున్న అల్లు శిరీష్, 'సీత'లకు అనూహ్యమైన టెన్షన్ 'నిఖిల్' రూపంలో వచ్చి పడింది. చూడాలి మరి, ఈ రెండు డేట్స్‌లో నిఖిల్ ఏ డేట్‌కి చెక్ పెడతాడో.