యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. 'కిర్రాక్ పార్టీ' సినిమా తర్వాత నిఖిల్ నుండి సినిమా రాలేదు. నిజానికి 'అర్జున్ సురవరం' ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. మొదట్లో తలెత్తిన టైటిల్ వివాదంతో ఈ సినిమాకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎంతో ముచ్చటపడి 'ముద్ర' అనే టైటిల్ పెట్టుకున్నాడు నిఖిల్. కానీ, అంచనాల్లేకుండా జగపతిబాబు నటించిన ఓ సినిమా అదే టైటిల్‌తో నిర్మితమై, కామ్‌గా ధియేటర్స్‌లోకి వచ్చేయడంతో, తన టైటిల్‌ని 'అర్జున్ సురవరం'గా మార్చుకోవాల్సి వచ్చింది నిఖిల్.
ఆ తర్వాత రిలీజ్ టైమ్ అనుకున్నాక, ఆంగ్ల మూవీ 'అవెంజర్స్' రూపంలో రిలీజ్ వాయిదా పడడం, అప్పటి నుండి ఇప్పటిదాకా ఇక రిలీజ్‌కి జోచుకోలేకపోయింది 'అర్జున్ సురవరం'. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కి లైన్ క్లియరైందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో నిఖిల్ సినిమాకి స్పేస్ దొరుకుతుందా.? కష్టమే అని చెప్పాలి. అయితే, ఈ పాటికే నిఖిల్ తన సినిమా రిలీజ్‌కి ప్రయత్నించి ఉండాల్సింది అని ఆయన అభిమానులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకో మరి నిఖిల్ తొందరపడలేదు. ఇక ఇప్పుడు చిన్న సినిమాలూ, పెద్ద సినిమాలూ అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే నిఖిల్ కూడా తన సినిమా రిలీజ్ ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యకరం. రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ, మొత్తానికి ఈ సీజన్‌లోనే 'అర్జున్ సురవరం' కూడా ప్రేక్షకుల్ని అలరించనుందని తెలుస్తోంది.