రామ్ ప‌క్క‌న హీరోయిన్లు వీళ్లే

By Gowthami - October 17, 2019 - 16:15 PM IST

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు రామ్‌. ఇప్పుడు ఓ త‌మిళ రీమేక్ లో న‌టించ‌డానికి రెడీ అయ్యాడు. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న చిత్రం 'త‌డ‌మ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో రామ్ క‌థానాయ‌కుడిగా రీమేక్ చేస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్సుంది. వాళ్లిప్పుడు ఫిక్స‌యిపోయారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా నివేధా పేతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ క‌థానాయిక‌లుగా ఎంపిక‌య్యారు.

 

'మెంటల్ మ‌దిలో', 'బ్రోచేవారెవ‌రురా' లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకుంది నివేదా. 'నేల టికెట్‌'తో్ మాస్‌ని అల‌రించింది మాళ‌విక శ‌ర్మ. వీరిద్ద‌రూ ఇప్పుడు రామ్‌తో జోడీ క‌ట్ట‌బోతున్నారు. స్ర‌వంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. 2020 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS