యంగ్ హీరో నిఖిల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ఎంచుకుంటున్నాడు. మూస కథలకే పరిమితం కాకుండా, సినిమా సినిమాకీ వేరియేషన్ చూపిస్తున్నాడు. ఈ యంగ్ హీరోగా తాజాగా 'ముద్ర' సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో విజయం సాధించిన 'కణితన్'కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టి.సంతోష్ దర్శకుడు. కాగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు.
తన సొంత సినిమా ముచ్చట్లతో పాటు, కొన్ని సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. అందులో భాగంగానే తన కొత్త సినిమా 'ముద్ర'కి సంబంధించి నిఖిల్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. ఈ సినిమాలో లావణ్యతో పాటు, వెన్నెల కిషోర్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. వీరిద్దరి గురించీ నిఖిల్ వేసిన ట్వీటే ఇప్పుడు వైరల్ అయ్యింది. లావణ్య, వెన్నెల కిషోర్ కలిసి నటించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం అందుకుంది.
నాని కెరీర్ ఆ సినిమాతోనే టర్న్ అయ్యింది. అలాగే వీరిద్దరూ కలిసి తనకు కూడా అలాంటి అదృష్టాన్నే వెంట తీసుకొస్తారనీ ఆశిస్తున్నా.. అంటూ నిఖిల్ ట్వీటాడు. వీళ్లిద్దరికీ భలే బిస్కెట్ వేశాడు కానీ, నిఖిల్ వేయాల్సిన బిస్కెట్ ఆడియన్స్‌కి కదా. ఆ విషయం మర్చిపోయాడు. ఏది ఏమైతేనేం. నిఖిల్ ఆశపడినట్లు 'ముద్ర' మంచి హిట్ కొట్టాలని మనం కూడా ఆశిద్దాం.