రెండో ‘కార్తికేయ’ కాన్సెప్ట్‌ అదిరింది బాస్‌.!

మరిన్ని వార్తలు

పాము, హిప్నటైజ్‌.. దేవుడు, నమ్మకం.. తదితర అంశాలతో ఉత్కంఠభరింతంగా తెరకెక్కించిన ‘కార్తికేయ’ చిత్రం మంచి విజయం అందుకుంది. సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ మూవీస్‌ని ఇష్టపడే వారి మనసు దోచింది. హీరో నిఖిల్‌ సిద్దార్ద్‌ కెరీర్‌ బెస్ట్‌ మూవీగా నిలిచింది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ కథకీ పాము కథే మూలం. అయితే, ఈ సారి మరింత టెక్నికల్‌ వేల్యూస్‌తో, ఆసక్తికరమైన కథా, కథనాలతో స్క్రిప్టు సిద్ధం చేశాడట డైరెక్టర్‌ చందూ మొండేటి. పాము బ్యాక్‌ గ్రౌండ్‌లో ఇంతవరకూ వినని సరికొత్త కాన్సెప్ట్‌ని రెడీ చేశాడట.

 

లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చాలా రిచ్‌గా ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌ అన్నట్లుగా కాన్సెప్ట్‌ పోస్టర్‌తోనే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేశారు. తొలి పార్ట్‌లో కలర్స్‌ స్వాతి హీరోయిన్‌గా నటించగా, సీక్వెల్‌ కోసం అనుపమా పరమేశ్వరన్‌ని ఎంచుకున్నారు. కలర్స్‌ స్వాతి ఓ ఇంపార్టెంట్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇకపోతే, ఇటీవలే ‘అర్జున్‌ సురవరం’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి జోష్‌ మీదున్న నిఖిల్‌, త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నసంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS