ఇంత ఘాటు 'ముద్ర' ఏమిటో.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ తన కొత్త సినిమా 'ముద్ర' రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేసేశాడు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 28వ తేదీన అర్జున్‌ లెనిన్‌ సురవరం మీ ముందుకు వస్తున్నాడంటూ ప్రకటించేశాడు యంగ్‌ హీరో నిఖిల్‌. ఈ సినిమాలో నికిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. 

సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తూ, నిఖిల్‌ పోస్ట్‌ చేసిన 'ముద్ర' పోస్టర్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందుక్కారణం, ఈ పోస్టర్‌లో నిఖిల్‌, లావణ్యల మధ్య కెమిస్ట్రీనే. నిఖిల్‌ చేతిలో ఫొటో కెమెరా, లావణ్య చేతిలో ఓ ఛానల్‌ మైక్‌ కన్పిస్తున్నాయి. బ్యాక్‌డ్రాప్‌లో అల్లర్లు జరుగుతోంటే, ఫొటోగ్రాఫర్‌.. న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌.. ఘాటుగా కెమిస్ట్రీ వర్కవుట్‌ చేసేస్తున్నట్లుంది ఈ పోస్టర్‌. అయినా, చూసే కళ్ళను బట్టి కెమిస్ట్రీకి అర్థం మారిపోతుందనుకోండి. అది వేరే సంగతి. 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే నిఖిల్‌, లావణ్య పెయిర్‌ అదిరిపోయిందంతే. ఏ హీరోతో అయినా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అదరగొట్టేయడంలో లావణ్య త్రిపాఠి దిట్ట. హాట్‌గా కన్పించడమే కాదు, తనదైన నటనా ప్రతిభతో ఆకట్టుకోవడం లావణ్య స్పెషాలిటీ. అసలు సినిమా కథేంటి.? అంటే, అది తెరపైనే చూడాలంటోంది 'ముద్ర' టీమ్‌. ఇందులో వామపక్ష భావజాలం వున్న వ్యక్తిగా నిఖిల్‌ కన్పించబోతున్నాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. అర్జున్‌ లెలిన్‌ సురవరం అన్న పేరు అందుకే హీరోకి పెట్టారట. 

నిఖిల్‌ ఇటీవలి కాలంలో ప్రయోగాత్మక సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. ఆ కోవలోనే ఈ 'ముద్ర' కూడా ఓ ప్రత్యేకమైన సినిమా కాబోతోందట ఈ యంగ్‌ హీరోకి. ఆల్‌ ది బెస్ట్‌ టు నిఖిల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS