పాపం నిఖిల్‌ 'ముద్ర'కి ఎంత కష్టమొచ్చింది.?

మరిన్ని వార్తలు

ఈ రోజు 'ముద్ర' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'ముద్ర' అంటే యంగ్‌హీరో నిఖిల్‌ నటిస్తున్న సినిమా అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా పప్పులో కాలేసినట్లే. అందరూ అలాగే పప్పులో కాలేసి నిఖిల్‌ సినిమా అనుకుని ధియేటర్స్‌కి వెళ్లారు. కానీ అది నిఖిల్‌ 'ముద్ర' కాదు. జగపతిబాబు 'ముద్ర'. ఈ ముద్ర రిలీజవుతున్న ధియేటర్స్‌ వద్ద నిఖిల్‌ 'ముద్ర' సినిమా పోస్టర్స్‌ పెట్టేశారు. దాంతో నిఖిల్‌ సినిమా అనుకుని ధియేటర్‌కి వెళ్లినవాళ్లు ఖంగు తిన్నారు. 

 

నిఖిల్‌ సినిమా అనుకుని కొన్నిచోట్ల ధియేటర్స్‌ హౌస్‌ ఫుల్‌ కూడా అయిపోయాయి. నిజంగా ఇది అన్యాయం కదా. సోషల్‌ మీడియాలో నిఖిల్‌ గగ్గోలు పెడుతున్నాడు. మా టైటిల్‌ వాడేసుకున్నారే అని రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇంతలా నిఖిల్‌కి అన్యాయం జరిగిందే పాపం. ఇక బుల్లితెరపై తాజాగా ఈ సినిమా ప్రోమో వస్తే కానీ, ఆడియన్స్‌కి తెలియలేదు. అది చూసి ఇది ఏ ముద్ర అని ఆశ్చర్యపోయారంతా. ఈ 'ముద్ర'లో జగపతిబాబు స్టైలిష్‌ లుక్స్‌లో డైలాగుల మీద డైలాగులు చెప్పేస్తున్నాడు. 

 

ప్రోమోలో జనవరి 25న రిలీజ్‌ అనే స్క్రోలింగ్‌ కనిపిస్తోంది. ఏ పబ్లిసిటీ, ఏ ప్రమోషన్‌ లేకుండా సైలెంట్‌గా విడుదలైపోయిన ఈ 'ముద్ర', నిఖిల్‌ 'ముద్ర'ను ఇలా దెబ్బ తీసేసిందే. నిఖిల్‌ ఇప్పుడు టైటిల్‌ మార్చుకుంటాడా.? లేక 'కళ్యాణ్‌రామ్‌ కత్తి', 'మహేష్‌ ఖలేజా' టైటిల్స్‌లా ఈ టైటిల్‌కి కూడా ముందు తన పేరు చేర్చుకుంటాడేమో చూడాలి మరి. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ నిఖిల్‌ 'ముద్ర'లో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS