సెంచ‌రీ కొట్టేసిన సంక్రాంతి అల్లుళ్లు

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతి విజేత‌గా నిలిచిన చిత్రం 'ఎఫ్ 2'. సంక్రాంతి వెళ్లినా ఈ అల్లుళ్ల హంగామా త‌గ్గ‌లేదు. ఇటీవ‌లే రూ.50 కోట్ల (షేర్‌) అందుకున్న ఈ చిత్రం... ఇప్పుడు వంద కోట్లు (గ్రాస్‌) మైలు రాయి కూడా అందుకుంది. 13 రోజుల్లోనే ఈ ఘ‌న‌త సాధించి.. దిల్ రాజు దోసెట్లో లాభాల్ని కురిపించింది. షేర్‌గా లెక్కేస్తే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చిత్రానికి 68 కోట్లు వ‌చ్చిన‌ట్టు లెక్క‌. 

 

ఈ వారం `మిస్ట‌ర్ మ‌జ్ను` ఒక్క‌టే విడుద‌ల అవుతోంది. అంటే... ఎఫ్ 2కి పెద్ద‌గా పోటీ లేన‌ట్టే. ఇప్ప‌టికీ.. కుటుంబ ప్రేక్ష‌కులు ఎఫ్ 2 చూడ్డానికి మొగ్గు చూపిస్తున్నారంటే, థియేట‌ర్లు ఇంకా నిండుతున్నాయంటే... ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఏస్థాయిలో ఉందో ఊహించుకోవొచ్చు. మొత్తానికి 2019లో తొలి వంద కోట్ల సినిమాగా ఎఫ్ 2 రికార్డు సృష్టించింది. మ‌రి ఈ దూకుడు ఇంకెన్ని రోజులు కొన‌సాగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS