'రంగస్థలం' సినిమా వసూళ్ల లెక్కల్లో తికమకలు వచ్చాయి. దాంతో ఇకపై తన సినిమా పోస్టర్స్‌పై వసూళ్ల లెక్కలు లేకుండా జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యాడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. అదే 'వినయ విధేయ రామ' సినిమా విషయంలో ఫాలో అయ్యాడు. ఈ సినిమాకి ట్రేడ్ రికార్డులు తప్ప గ్రాస్ లెక్కల్ని డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్ అనౌన్స్ చేసింది లేదు.
కానీ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 2' వసూళ్లు 100 కోట్లు గ్రాస్ అంటూ తెగ పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఈ గ్రాస్ లెక్కల వల్ల ఎవ్వరికీ లాభం లేదు. 'రంగస్థలం'తో సహా, 'భరత్ అనే నేను', 'నా పేరు సూర్య', అరవింద సమేత' సినిమాల విషయంలో ఇలాగే గ్రాస్ లెక్కలు చెప్పి విమర్శల్ని ఎదుర్కొన్నారు చిత్ర యూనిట్. షేర్ వరకూ ఓకే. కానీ గ్రాస్ లెక్కలు చెప్పడం దండగ అని జనం అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమాతో ఈ వసూళ్ల లెక్కల్ని వెటకారం చేసిన సంగతి తెలిసిందే. సో 'ఎఫ్ 2' టీమ్ గ్రాస్ చెప్పకుండా ఉండుంటే బాగుండేది. గ్రాస్ చెప్పి ఆ సినిమా విజయాన్ని తక్కువ చేశారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'ఎఫ్ 2' సూపర్ హిట్ టాక్‌తో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్‌రాజు నిర్మించారు.