నిఖిల్‌ పబ్లిసిటీ 'ముద్ర'.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా వేదికగా యంగ్‌ హీరో నిఖిల్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ మీద సెటైర్లు వేశాడు. 'సినిమా అనే సముద్రంలో మనం చిన్న నీటి బొట్టు లాంటి వాళ్లం. ఇందులో మనకి మనతోనే పోటీ. ప్రపంచమంతా మన చుట్టూనే తిరుగుతుందని అనుకోవడం పొరపాటు..' అని విజయ్‌ దేవరకొండనుద్దేశించి నిఖిల్‌ అన్నాడు. 

అసలు నిఖిల్‌ ఎందుకిలా చేశాడు.? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠకు కారణమైంది. తన కొత్త సినిమా 'ముద్ర' ప్రమోషన్‌ కోసమే అనవసరంగా ఈ వివాదంలోకి నిఖిల్‌ దూరాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే పెరిగిన పెట్రోల్‌ ధరలపైనా, ప్రత్యేక హోదా పైనా, పరువు హత్యల పైనా ఇలా చాలా విషయాలపై నిఖిల్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఉంటాడు. అలాగే ఇది కూడా ఓ మామూలు స్పందనగానే తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వివాదంతో నిఖిల్‌ బాగా హైలైట్‌ అయ్యాడు. 

'ముద్ర' సినిమాలో నిఖిల్‌ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు. ఎప్పటికప్పుడే సినిమా అప్‌డేట్స్‌ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం నైట్‌ షూట్‌ జరుగుతోందట. ఆ వివరాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఓ బిల్డింగ్‌పై నుండి ఫీట్లు చేస్తున్నాడు. బహుశా ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరుపుతుండోచ్చు!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS