రికార్డు ధరకి ముద్ర శాటిలైట్ రైట్స్

By iQlikMovies - July 02, 2018 - 18:07 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ లో ఉన్న యంగ్ హీరోలలో మంచి టాలెంట్ తో పాటు భవిష్యత్తు ఉన్న హీరోలలో ఒకరు నిఖిల్. ఈ మధ్య కాలంలో చేసిన చిత్రాలు అనుకున్నంత విజయం ఇవ్వకపోయినప్పటికి కూడా కెరీర్ లో స్పీడ్ అనేది ఏ మాత్రం తగ్గలేదు.

తాజాగా నిఖిల్ ముద్ర అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఇది తమిళంలో వచ్చిన కనితన్ అనే చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్నది. ఇక తమిళంలో ఈ చిత్రం విజయ్ సాధించడం అదే సమయంలో నిఖిల్ మార్కెట్ ని సైతం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈ ముద్ర చిత్రానికి రూ 5.5 కోట్లు వెచ్చించి శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ దక్కించుకుందట.

సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఇంతటి మంచి బిజినెస్ జరగడానికి కారణం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుండగా ఈ చిత్రం తమిళ మాతృకకి దర్శకత్వం వహించిన TN సంతోష్ తెలుగు వెర్షన్ కి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. 

మరి ఇంతటి మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS