రేపు ఉదయం 06:31 ని"లకు హీరో నిఖిల్ పెళ్ళి.

By iQlikMovies - May 13, 2020 - 19:07 PM IST

మరిన్ని వార్తలు

రేపే యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ పెళ్ళి

ముహూర్తం : ఉదయం - 06:31 ని"లకు 

వేదిక : షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్

 

త‌ర త‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ కి పెళ్లి గ‌డియలు రానే వ‌చ్చాయి.. డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ తో నిశ్చితార్థం అయ్యిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌పంచం మెత్తాన్ని క‌రొనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మ‌ద్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. అయితే క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అనే పెద్ద‌ల సామెత నిజ‌మ‌వుతుంది.

 

లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వదువరులు ఇద్ద‌రి జాత‌కాల రీత్యా రేపు ఉదయం 6:31 ని"లకు పెళ్ళి చేయ‌టానికి ఇరు పెద్ద‌లు నిర్ణ‌యించారు. అయితే సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ స‌ర్కిల్ ని మాత్ర‌మే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్ళి చేయ నిశ్చ‌యించారు. ఈ పెళ్ళి లో ప్ర‌భుత్వం సూచించే అన్ని ప‌ద్ద‌తులు పాటిస్తున్నారు. అభిమానుల మ‌ద్య‌లో ఈ పెళ్ళి ని ఆఢంబరంగా చేసుకొవాల‌నుకున్న నిఖిల్ ఇప్ప‌డు ఈ పరిస్థుతుల్లో కొవిడ్‌-19 వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే వుద్ధేశ్యం తో ఈ పెళ్ళి ఇలా నిరాఢంబ‌రంగా చేసుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంభందించిన ఫోటోస్‌, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్ కి సోష‌ల్ మీడియా ద్వారా అందించ‌నున్నారు. ఈ నూత‌న‌వ‌ధువ‌రుల‌ను ఎక్క‌డి వారు అక్క‌డే వుండి ఆశీర్వ‌దించాల‌ని కొరుకుంటున్నాము.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS