యంగ్ హీరో నిఖిల్ 'ముద్ర' మామూలుగా పడేలా లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ముద్ర'. సరికొత్త కథా, కథనాలతో రూపొందుతోందీ చిత్రం. చొక్కా లేకుండా ఉన్న ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు యంగ్ హీరో నిఖిల్. ఇప్పుడీ ఫోటో వైరల్ అయ్యింది. అంతకు ముందు కూడా ఇలాంటిదే ఒక ఫోటో షేర్ చేశాడు.
గెడ్డంతో చెవిపోగుతో, కండలు తిరిగిన శరీరంతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు నిఖిల్. అర్జున్ లెనిన్ సురవరం అనే జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నాడు నిఖిల్ ఈ సినిమాలో. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే అర్ధమైంది. టి.ఎన్.సంతోష్ దర్శకుడు. కాగా అప్పుడెప్పుడో జీవా, కార్తీక జంటగా తెరకెక్కిన తమిళ అనువాద చిత్రం 'రంగం' ఛాయలు ఈ సినిమాలో అక్కడక్కడా కనిపిస్తాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
ఆ సినిమాలో హీరో కూడా జర్నలిస్టు పాత్రలోనే కనిపిస్తాడు. స్మార్ట్‌గా కనిపించే పవర్‌ఫుల్ జర్నలిస్టు పాత్ర అది. అలాగే లుక్‌లో స్మార్ట్‌గా కనిపించే నిఖిల్ పాత్ర చిత్రీకరణ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట. ఊహించని స్క్రీన్‌ప్లేతో కట్టిపడేయనున్నారట. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా సోషల్ మీడియాలో నిఖిల్ వదులుతున్న ఫోటోలు సినిమాపై ఆశక్తిని పెంచేస్తున్నాయి.
'కిర్రాక్ పార్టీ' సినిమాలో నిఖిల్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతో నిఖిల్‌లోని మరో న్యూ యాంగిల్‌ని బయటికి తీసుకురానున్నాడట డైరెక్టర్ టి.ఎన్.సంతోష్. ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్‌తో జత కడుతోంది.