యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత..'కు మరో రెండు షోలు ఎక్స్‌ట్రా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దసరా వెకేషన్‌లో ఇది అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. అలాగే టికెట్ రేట్లు పెంచేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో ఇంకా తెలీదు కానీ, తెలంగాణలో మాత్రం ఇవేమీ వర్కవుట్ అయ్యేలా లేదు.
తెలంగాణలో గవర్నమెంట్ లేని కారణంగా ఇక్కడ అలాంటివి వీలు కాకపోవచ్చు. ఇకపోతే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కలెక్షన్స్ పరంగా 'అరవింద సమేత' ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తొలిసారి తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రాణం పెట్టి తీసేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌తో స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. పాటలు తక్కువే అయినా ఓ పాటలో ఎన్టీఆర్ డాన్సులు బాగా వేశాడంటూ ఇప్పటికే పోజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాధాక్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎన్టీఆర్‌పైనా, కథ పైనా పూర్తి నమ్మకంతో నిర్మాత ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ వ్యత్యించారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అరవింద సమేత'తొ ఎన్టీఆర్ వసూళ్ల వీరత్వం ఎలా ఉండబోతోదో చూడాలి మరి.