స్పీడ్‌ పెంచిన నిఖిల్‌ సిద్దార్ధ్‌.!

By iQlikMovies - October 19, 2018 - 10:48 AM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ స్పీడ్‌ పెంచేశాడు. 'కిరాక్‌ పార్టీ' తర్వాత కొంచెం కెరీర్‌ స్లో అయినా, ఇకపై వరుసగా తన నుంచి సినిమాలొస్తాయంటున్నాడు ఈ యంగ్‌ హీరో. ప్రస్తుతం 'ముద్ర' సినిమా చేస్తున్న సిద్దార్ధ తన తదుపరి సినిమా టైటిల్‌ని ప్రకటించేశాడు. టైటిల్‌తో పాటుగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేయడం గమనార్హం. 

'ముద్ర' తర్వాత నిఖిల్‌ చేయబోయే సినిమా పేరు 'శ్వాస'. రాత్రి వేళ, రోడ్డు మీద వెళుతూ.. హీరో, హీరోయిన్లు కన్పిస్తున్నారు. ఆకాశంలో వరుసగా మూడు నక్షత్రాలు, వాటిని టార్చ్‌లైట్‌తో హీరో హీరోయిన్లు పరిశీలిస్తున్నట్లుగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. తెలుగు సినిమా ప్రయోగాల బాట పట్టిన దరిమిలా, నిఖిల్‌ ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడోననే ఉత్కంఠ ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ తర్వాత పెరిగింది. 

ఆల్రెడీ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ 'అంతరిక్షం' అనే సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు నిఖిల్‌ కూడా 'శ్వాస' అంటూ ఆకాశం వైపే చూస్తున్నాడు. ఇదొక థ్రిల్లర్‌ మూవీ అని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందాల భామ నివేదా థామస్‌ ఈ సినిమాలో నిఖిల్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 

కొత్త దర్శకుడు కిషన్‌ ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఉప్పలపాటి చరణ్‌ తేజ్‌, హరి నికేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS