యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. తన కొత్త సినిమాల ముచ్చట్లు చెబుతూ, అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉంటాడు. ఈ మధ్య తిత్లీ తుఫాను బాధితుల విషయంలో నిఖిల్ స్పందించిన తీరు అందర్నీ మెప్పించేసింది. తిత్లీ బాధితులకు చేసిన సాయంతో అందరి మనసుల్ని గెలిచేశాడు నిఖిల్. అలాగే పలు రాజకీయ అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.
ఇకపోతే తాజాగా నిఖిల్ మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన 'సర్దార్ వల్లభాయ్ పటేల్' విగ్రహం విషయంలో సరికొత్తగా స్పందించాడు. దేశమంతటినీ ఐక్యంగా ఉంచాలనే తపనతో ఆయన దేశానికి చేసిన సేవల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందే. అయితే ఆయనే కనుక బతికి ఉంటే 'స్టేట్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన విగ్రహానికి అయిన ఖర్చుపై ఎలా స్పందించేవారో అని నిఖిల్ చేసిన ట్వీట్ సంచలనమైంది. అవును పటేల్ విగ్రహానికి అయిన ఖర్చు అక్షరాలా మూడువేల కోట్ల రూపాయలు మరి. ఈ ఖర్చుతో ఎంత మంది పేదలకో కనీస సాయం చేయొచ్చనేది బహుశా నిఖిల్ అభిప్రాయం కాబోలు.
నిఖిల్‌కే కాదు, ఈ రకమైన అభిప్రాయం చాలామందికే ఉంటుంది. అయితే ధైర్యంగా నిఖిల్ తన అభిప్రాయాన్ని ఎక్స్‌ప్రెస్ చేశాడు. నిఖిల్ తాజాగా 'ముద్ర' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ ఓ జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్రను చాలా ప్రత్యేకంగా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారనీ సమాచారమ్. ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.