సల్మాన్‌ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, షారూఖ్‌ఖాన్ కావచ్చు ఈ ముగ్గురినీ బాలీవుడ్‌లో ఖాన్స్ త్రయం అని పిలుస్తుంటారు. ఏభై ఏళ్లు దాటేసినా వాళ్లు మెయింటైన్ చేసేలా ఫిజిక్ ఇంకెవ్వరూ మెయింటైన్ చేయలేరేమో. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో అదరగొట్టేస్తుంటారు. అంతేకాదు, విలక్షణమైన పాత్రల్నీ ఎంచుకుంటూ ఉంటారు. వీళ్లేంటీ ఇలాంటి సినిమాలు చేయడమేంటీ.? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు.
అమీర్‌ఖాన్ ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమీర్ చిత్ర విచిత్రమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక షారూఖ్ ఖాన్ విషయానికి వస్తే, అప్పుడెప్పుడో కమల్‌హాసన్ చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు. 'జీరో' సినిమాలో మరుగుజ్జుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. అసలీ పాత్రను ఎలా తీర్చిదిద్దారో చూసే వాళ్లకి ఏమాత్రం అర్ధం కావడం లేదు.
కమల్‌హాసన్ ఆ మరుగుజ్జు పాత్ర చేసి రెండు దశాబ్ధాలకు పైనే అయిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత షారూఖ్ అలాంటి పాత్రను చేస్తున్నాడు. మధ్యలో చాలా మంది కాస్సేపు తెరపై మరుగుజ్జు పాత్రలో కనిపించారు. కానీ పూర్తిస్థాయి మరుగుజ్జు పాత్ర అంటే కమల్ తర్వాత షారూఖ్‌దే. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి ఇలాంటి పాత్ర ఎంచుకోవడం చిన్న విషయం కాదు. పాత్రల విషయంలో ఇంత కమిట్‌మెంట్ చూపుతున్న షారూఖ్‌ఖాన్ 'జీరో'తో సంచలన విజయం సాధించాలని ఆశిద్దాం.
గతంలో వచ్చిన 'జీరో' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపో మాపో ట్రైలర్ రాబోతోంది. డిశంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.