తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలకి కొదవలేదు. అలాగే వారిలో చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు.
ఇక విషయానికి వస్తే, హీరో నిఖిల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నిఖిల్ కి కాబోయే భార్య పేరు తేజస్వి! ఇక పెళ్ళికూతురు నితిన్ కుటుంబానికి దగ్గరి బందువట.
వీరిరువురి నిశ్చితార్థం ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో జరగనుండగా, వీరి వివాహం అక్టోబర్ 1వ తారీఖున జరగనున్నట్టు నిఖిల్ సన్నిహిత వర్గాల సమాచారం.
ఈ శుభ సందర్భంలో iqlikmovies.com తరపున ఈ కాబోయే జంటకి వివాహ శుభాకాంక్షలు.