'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ సందర్భంగా హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. బైక్ మీద వెళుతున్న సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'చిన్న జాగ్రత్త పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది' అని పేర్కొంటూ సన్నిహితులు, స్నేహితులు, అభిమానులకు క్షమాపణ చెప్పాడు. అయితే అంతలోనే జరిగిన ప్రమాదం తాలూకు వీడియో పోస్ట్ చేయబోతున్నామనీ, అది చూస్తే అందులో తన తప్పు ఏమీ లేదని తేలుతుందని మంచు విష్ణు పేర్కొనడం కొంత గందరగోళంగా మారింది. నిర్లక్ష్యం అని కాదుగానీ చిన్నపాటి అజాగ్రత్త వల్ల జరిగిన ప్రమాదం ఇది. అందుకే ఆ చిన్న అజాగ్రత్తకు ఆయన క్షమాపణ చెప్పాడు. అయితే తన అజాగ్రత్త కారణంగా స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందడం మంచు విష్ణు మనసుని కలచివేసింది. అందుకే క్షమాపణ కూడా చెప్పాడని అర్థం చేసుకోవాలి. సినిమా షూటింగ్‌లో ప్రమాదాలు కొత్త కాదు. ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాసరే ఒక్కోసారి, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని అజాగ్రత్త అని కూడా అనలేం. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఎవరికైనా గాయాలు తగిలితే షెడ్యూల్స్ ఇబ్బందికరంగా మారిపోతాయి. ఏదైతేనేం మంచు విష్ణు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌కి విష్ణు హాజరు కావాలని ఆశిద్దాం.