కెరీర్ మొదట్లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే పేరుతో వచ్చిన బి-గ్రేడ్ అడల్ట్ కామెడీ మూవీ చేసినప్పటికీ, ఆ తర్వాత ‘తిప్పరామీసం’తో మంచి సినిమానే ఎంచుకుంది అందాల భామ నిక్కీ తంబోలీ. అయితే, తెలుగునాట సరైన అవకాశాలు దక్కక, కోలీవుడ్ మీదనే ఆశలు పెట్టుకుంది. అందానికి అందం.. నటనలోనూ చెప్పుకోదగ్గ ప్రతిభ.. అన్నీ వున్నా, ఎందుకో ఈ బ్యూటీ మంచి ఛాన్సులు దక్కించుకోవడంలో విఫలమవుతోంది.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమవడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇదిగో ఇలా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. ఏమో, ఈ బ్యూటీ ఏ పెద్ద దర్శకుడి కంట్లో పడి, తన కెరీర్‌ని కుదురుకునేలా చేసుకోగలుగుతుందో ఇప్పుడే చెప్పలేం. అందాల ప్రదర్శన అనేది తప్పదనీ, అయితే అందులో హద్దులు తనకు తెలుసని అంటోందిగానీ, హద్దులు దాటేసిన అందాల్ని ఇప్పటికే ఆమె వెండితెరపై ఆరబోసేసింది.