బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన సోదరి కారణంగా చిక్కుల్లో పడుతోంది. కంగనా సోదరి రంగోలీ చందేల్, ఈ మధ్యనే సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఆమె సోషల్ మీడియా అకౌంట్ సస్పెండ్ అయిన విషయం విదితమే. అయితే ఆ సస్పెన్షన్‌పై కంగన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో కంగనా రనౌత్‌పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగనా రనౌత్, మత విధ్వేషాలు రగుల్చుతున్నారని సదరు న్యాయవాది తన ఫిర్యాదులో ఆరోపించారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, కంగనా మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని అంటోంది. కరోనా వైరస్ నేపథ్యంలో రంగోలీ చందేల్ ఓ ఘటనపై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అదే అసలు వివాదానికి కారణం. ఇదిలా వుంటే, కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోలీ చందేల్‌కి మద్దతుగా పలువురు నిలబడ్తోంటే, చాలామంది ఈ ఇద్దరిపైనా మండిపడుతున్నారు. కంగనా సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’ సినిమాలో నటిస్తోంది కంగనా రనౌత్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్ ఇది.