ట్రైలర్‌ టాక్‌: అనుష్క ‘నిశ్శబ్ధం’ ‘గోస్ట్‌’ ఎవరంటే.!

మరిన్ని వార్తలు

స్వీటీ అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ నుండి లేటెస్ట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌లో క్రియేట్‌ చేసిన క్యూరియాసిటీనే ట్రైలర్‌లోనూ కొనసాగించారు. అయితే, ఓ పాతికేళ్ల అమ్మాయి ఇదంతా చేస్తోందా.? అంటే నమ్మలేకపోతున్నాం.. ఆమెకి ఇంకెవరో హెల్ప్‌ చేస్తుండాలి.. దీనికంతటికీ కారణం ఓ దెయ్యమా..’ అంటూ ఉత్కంఠ కలిగే డైలాగ్స్‌ని ట్రైలర్‌లో వదిలారు. అయితే, ఇంతకీ ఈ సినిమాలో గోస్ట్‌ ఎవరు.? అనేది సస్పెన్స్‌. ముగ్గురు ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. అనుష్కతో పాటు, అంజలి, షాలినీ పాండే. ముగ్గురి పాత్రలకూ స్కోప్‌ ఉన్నట్లు ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది. మాధవన్‌ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇకపోతే, అనుష్క విషయానికి వస్తే, మూగ, చెవిటి అమ్మాయిగా తనదైన సంజ్ఞలతో హావభావాలు అదరగొట్టేస్తోంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పాత్రలో అంజలి ఇరగదీసేస్తోంది. ఇక కనిపించింది కాసేపే అయినా షాలినీ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దెయ్యం షాలినీయేనా అనే అనుమానం కలిగించేలా ఉంది. గోపీ సుందర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గుండెల్లో దడ పుట్టిస్తోంది. సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ, హిందీ తదితర నాలుగు భాషల్లో రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా కోన ఫిలిం ప్యాక్టరీ బ్యానర్‌లో కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS