ఆ రీమేక్‌లో నితిన్‌ కన్‌ఫామ్‌.!

By Inkmantra - February 20, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ మూవీ ‘అంధాదున్‌’ని టాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ రీమేక్‌ కన్‌ఫామ్‌ అంటూ, ఈ సినిమాలో నటించబోయే హీరోనే స్పష్టం చేశాడు. ఇంతకీ టాలీవుడ్‌ ‘అంధాదున్‌’ ఎవరో తెలుసా? ‘భీష్మ’. అదేనండీ నితిన్‌. తాజాగా ఈ విషయాన్ని నితిన్‌ కన్‌ఫామ్‌ చేశాడు తాజాగా.

 

ఈ శుక్రవారం ‘భీష్మ’ సినిమాతో నితిన్‌ ప్రేక్షకు ముందుకు రానున్నాడు. ఈ నేపధ్యంలో ఇచ్చిన లేటెస్ట్‌ ఇంటర్వ్యూలో ‘అంధాదున్‌’ మూవీ ముచ్చట్ల గురించి ఫ్యాన్స్‌కి వివరించాడు. నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ మూవీ అయిన ‘అంధాదున్‌’లో యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా మంచి నటన కనబరిచాడు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అలాంటి పాత్రలో కనిపించడం నిజంగా ఛాలెంజ్‌తో కూడుకున్నదే. అందుకే చాలా భయమేస్తోంది.. అంటూ నితిన్‌ చెప్పాడు.

 

ప్రస్తుతం ఈ రీమేక్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటనతో పాటు, మిగిలిన టెక్నికల్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు నితిన్‌, చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కూడా జరుగుతోంది. ‘చదరంగం’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు నితిన్‌ హీరోగా ‘రంగ్‌దే’ మూవీ కూడా లైన్‌లో ఉంది. సో చూస్తుంటే, మరో రెండేళ్ల వరకూ నితిన్‌ డైరీ ఫుల్‌ అయిపోయినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS