బాలీవుడ్‌కి వెళ్తున్న మ‌న భీష్ముడు

By Gowthami - March 24, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్ సినిమాల‌పై బాలీవుడ్ బాగా దృష్టి పెట్టింది. ఇక్క‌డ ఓ మాదిరిగా ఆడిన సినిమాలు కూడా అక్క‌డి వాళ్లు ఎగ‌రేసుకుని పోతున్నారు. ఈ విష‌యంలో క‌ర‌ణ్ జోహార్ అంద‌రికంటే ముందున్నాడు. తెలుగులో అట్ట‌ర్ ఫ్లాప్ అయిన డియర్ కామ్రేడ్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ హ‌క్కుల్ని క‌ర‌ణ్ ఇది వ‌ర‌కే సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఓ హిట్ సినిమానీ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

 

నితిన్ - ర‌ష్మిక జంట‌గా న‌టించిన భీష్మ ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని క‌ర‌ణ్ జోహార్ సొంతం చేసుకున్న‌ట్టు టాక్‌. రూ.3 కోట్లు వెచ్చించి ఈ సినిమా హ‌క్కుల్ని ఆయ‌న కొనుగోలు చేశార‌ట‌. ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ఈ సినిమాని అక్క‌డ రీమేక్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ద‌ర్శ‌కుడెవ‌రో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS