సుకుమార్ రైటింగ్స్ లో నితిన్

By iQlikMovies - November 02, 2018 - 11:44 AM IST

మరిన్ని వార్తలు

గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా సతమతమవుతున్న నితిన్ తాజాగా ఒక ఆసక్తికర ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపినట్టుగా సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం, కుమారి 21F దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ మధ్యనే ఒక కథని నితిన్ కి వినిపించడం, అది ఆయనకి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అయింది. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ తన నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ & GA2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయట.

ఇదిలావుండగా నితిన్ త్వరలోనే వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాక సూర్య ప్రతాప్ చిత్రం మొదలుపెడతాడా లేక రెండు ఒకే సమయంలో షూటింగ్ చేస్తాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఇద్దరు యువ దర్శకులతో సక్సెస్ కొట్టేందుకు హీరో నితిన్ సతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS