ఇప్పుడంటే సన్నీలియోన్ గురించి తెలిసింది కాబట్టి పోర్న్ సినిమాలు, పోర్న్ స్టార్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతకాలం క్రితం పోర్న్ స్టార్ అంటే షకీలా మాత్రమే.
నిజానికి ఆమె పోర్న్ స్టార్ కాదు. 'సి' గ్రేడ్ సెక్స్ సినిమాల నటి. ఈ మధ్యకాలంలో లిప్ టు లిప్ కిస్‌లు, అర్ధ నగ్న సన్నివేశాలు.. కామన్ అయిపోయాయి. ఓ 20 ఏళ్ల క్రితం పరిస్థితులు ఇలా లేవు. అప్పుడు దూసుకొచ్చిన షకీలా మలయాళ సూపర్‌స్టార్స్ బెదిరిపోయారు ఆమె సినిమాల తాకిడికి. సినిమా ఆడేది నాలుగైదు రోజులే అయినా, వసూళ్లు పోటెత్తేవి. ఆమె నటించిన 'కామేశ్వరి' సినిమా 100 రోజులు ఆడింది అప్పట్లో.
మలయాళంలో రూపొంది, తెలుగు, తమిళ, హిందీ సహా అనేక భాషల్లోకి డబ్ అయ్యేవి. షకీలా బాటలో చాలా మంది అందాల భామలు ఆ టైపు సినిమాల్లో నటించారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఆ షకీలా బయోపిక్ విడుదలకు సిద్ధమవుతోంది. 'షకీలా - పోర్న్ స్టార్ కాదు' అంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ భామ రిచా చద్దా ఈ సినిమాలో షకీలా పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో షకీలా మార్క్ హాట్ కంటెన్ట్ ఉంటూనే, అసలు షకీలా అలాంటి సినిమాల్ని ఎందుకు ఎంచుకుంది.? ఆమెను మలయాళ సినీ పరిశ్రమలో వేధించిందెవరు.? ఇలా చాలా అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఆ ప్రముఖులెవరో అన్న దానిపై రచ్చ అప్పుడే మొదలైపోయింది కూడా.