నితిన్ పెళ్లి ఫిక్సయ్యింది. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. లండన్‌లో చదువుకున్న షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ముహూర్తం కూడా ఖరారైంది. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి జరగబోతోందని ఖాయమైపోయింది. ఇది ప్రేమ వివాహం. పన్నెండేళ్ల నుంచీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట.
ఈ విషయం ఇంట్లోవాళ్లకు చెప్పడం, వాళ్లు ఒప్పుకోవడం జరిగిపోయాయి. అందుకే నితిన్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. షాలిని ఇక్కడి అమ్మాయే. కాకపోతే లండన్ వెళ్లి చదువుకుంది. అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ సంపాదించింది. నితిన్ కథానాయకుడిగా నటించిన భీష్మ ఈనెల 21న విడుదల అవుతోంది. మరోవైపు రంగ్ దే షూటింగ్‌లోనూ బిజీగా ఉంటున్నాడు నితిన్.