క‌త్తెర ప‌ట్టిన చేతుల‌తో మెగాఫోన్‌.. నితిన్ గ్రీన్ సిగ్న‌ల్‌

By iQlikMovies - June 16, 2021 - 14:31 PM IST

మరిన్ని వార్తలు

సినిమాలో 24 విభాగాలుంటాయి. అయితే అంద‌రి దృష్టీ... డైరెక్ష‌న్ పైనే. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అత‌నే కాబట్టి. ఎప్ప‌టికైనా ఆ స్థానంలో కూర్చోవాల‌ని అంద‌రూ ఆశిస్తుంటారు. అందుకే వివిధ విభాగాల నుంచి డైరెక్ట‌ర్లు వ‌చ్చారు. సంగీత దర్శ‌కులు, నృత్య ద‌ర్శ‌కులు, క‌ళా ద‌ర్శ‌కులు, కెమెరామెన్లూ మెగా ఫోన్ ప‌ట్టిన దాఖలాలు కోకొల్ల‌లు. అయితే ఈ కోవ‌లో ఎడిట‌ర్ల హ‌వా త‌క్కువ‌. వేలాది సినిమాలు చేసిన ఎడిట‌ర్లు కూడా ఎప్పుడూ డైర‌క్ష‌న్ జోలికి రాలేదు. అయితే ఇప్పుడు ఓ ఎడిట‌ర్ డైర‌క్ష‌న్ వైపు దృష్టి పెట్టాడు. త‌నే ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌.

 

బిజినెస్‌మెన్‌, టెంప‌ర్‌, లై లాంటి సినిమాల‌కు ఎడిట‌ర్ గా ప‌నిచేశాడు శేఖ‌ర్. మాస్ సినిమాల ప‌ల్స్ త‌న‌కు తెలుసు. ఎప్ప‌టి నుంచో డైరక్ష‌న్‌వైపు గురి. ఓ క‌థ కూడా రాసుకున్నాడు. ఇటీవ‌ల ఆ క‌థ‌ని నితిన్ కి వినిపించిన‌ట్టు టాక్. తొలి సిట్టింగ్ లోనే నితిన్‌... గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రాబోతోంద‌ని తెలుస్తోంది. నితిన్ ప్ర‌స్తుతం `మాస్ట్రో`లో న‌టిస్తున్నాడు. ఆత‌ర‌వాత ఒక‌ట్రెండు క‌థ‌లు రెడీగా ఉన్నాయి. మ‌రి ఈ క‌థ‌ని ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS