నితిన్ - రాశీఖన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. తాజాగా ఈ చిత్రం పాటల వేడుక జరిగింది. పాటల వేడుకను చాలా విభిన్నంగా నిర్వహించారు. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ బహమతులు ఇచ్చి పంపారు.
దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి ఆంచనాలున్నాయి. ఎందుకంటే సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. దిల్‌రాజు - సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో వచ్చిన 'శతమానం భవతి' చిత్రం మంచి విజయం అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది. ఈ కారణంగా ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అంతేకాదు, ఇంతవరకూ విడుదలైన పెళ్లి పోస్టర్ స్టిల్స్‌తోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
ఇక తాజాగా విడుదలైన 'శ్రీనివాస్ కళ్యాణం' టీజర్ మరింత ముద్దొచ్చేస్తోంది. ' ఏ.. అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా? మాకు రారా.?' అని రాశీఖన్నా చెబుతున్న డైలాగ్ ఎంతో క్యూట్‌గా ఉంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్‌నీ టీజర్‌లో బాగా చూపించారు. దిల్‌రాజు సినిమాలన్నీ ఓ పక్క యూత్‌నీ, మరో పక్క ఫ్యామిలీ ఆడియన్స్‌నీ కూడా ఎట్రాక్ట్ చేస్తాయి. అచ్చం అలాంటి ఫ్లేవర్‌తో రూపొందిన సినిమాలాగానే అనిపిస్తోంది 'శ్రీనివాస కళ్యాణం'.
'తొలిప్రేమ' సినిమాతో హిట్ అందుకున్న రాశీఖన్నా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'శ్రీనివాస కళ్యాణం'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలిక.