హీరో నితిన్ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేస్తున్నాడు. గత కొంతకాలంగా షాలినితో ప్రేమలో వున్న నితిన్, ఆమెను త్వరలో పెళ్ళాడబోతున్నాడు. నితిన్ - షాలినిల ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో.. వీరి పెళ్ళికి మార్గం సుగమం అయ్యింది. ఇది ప్రేమ మరియు పెద్దలు కుదిర్చిన వివాహం.. అని నితిన్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఇదిలా వుంటే, నితిన్ - షాలినిల పెళ్ళి పనులు మొదలయ్యాయి.
ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు పసుపు - కుంకుమ వ్యవహారానికి సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేశాడు నితిన్. ‘మ్యూజిక్ స్టార్ట్’ అయ్యిందని నితిన్ పేర్కొనడం గమనార్హం. అంటే, పెళ్ళి తంతుకి సంబంధించిన బాజా భజంత్రీలు షురూ అయ్యాయని అర్థం. ఇదిలా వుంటే, నితిన్ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేసి, వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నందుకు ఆనందంగా వుందంటూ ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల వ్యాఖ్యానించాడు. కాగా, పలువురు సినీ ప్రముఖులు నితిన్ - షాలినిలకు విషెస్ అందిస్తున్నారు. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా ఈ నెల 21న విడుదల కానున్న విషయం విదితమే. సినిమాపై పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. రష్మిక మండన్న ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో జోరందుకున్నాయి. ప్రమోషన్ పనుల్ని దాదాపుగా పూర్తి చేసేసి నితిన్, పెళ్ళి పనుల్లో నిమగ్నమయినట్లు తెలుస్తోంది.