కొత్త దర్శకులపై కన్నేసిన యంగ్‌ హీరో.!

By iQlikMovies - September 28, 2018 - 15:34 PM IST

మరిన్ని వార్తలు

'అఆ' సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌కి ఇక తిరుగే లేదనుకున్నారంతా. కానీ ఆ హిట్‌ని ఆ తర్వాత ఒక్క సినిమాతోనూ కంటిన్యూ చేయలేకపోయాడు నితిన్‌. తర్వాత వచ్చిన 'లై', 'ఛల్‌ మోహన్‌రంగా' సినిమాలు నిరాశపరచడంతో నితిన్‌ కాస్త డిప్రెషన్‌ ఫీలవుతున్నాడట. 

కరెక్ట్‌గా అదే టైంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమా నితిన్‌కి బూస్టప్‌ ఇచ్చిందట. ఈ సినిమా విజయం సాధించడంతో నితిన్‌ వెంటనే ఈ సినిమా డైరెక్టర్‌ అజయ్‌ భూపతిని లాక్‌ చేశాడట. ఓ రా సబ్జెక్ట్‌ని నితిన్‌ కోసం ప్రిపేర్‌ చేసే పనిలో అజయ్‌ భూపతి ఉన్నాడనీ సమాచారమ్‌. ఈ కొత్త డైరెక్టర్‌తో ఎలాగైనా నితిన్‌ హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడట. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌లో బిజీగా ఉన్నాడు అజయ్‌ భూపతి. 

మరోవైపు నితిన్‌ డిఫరెంట్‌ స్టోరీల వైపు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. విభిన్న కథలను వినడంలో బిజీగా ఉన్నాడట. కొత్త దర్శకుల నుండి వస్తున్న కొత్త కథలు ఇప్పుడు అనూహ్యంగా విజయం అందుకుంటున్నాయి. అందుకే కొత్త దర్శకులపై నితిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అలాగే హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌లకు కూడా మన చాక్లెట్‌ బోయ్‌ ఓకే అంటున్నాడట. 

చూడాలి మరి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తాడో నితిన్‌. ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS