'భీష్మ': కాపీ డబుల్‌ ధమాకా.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నితిన్‌ నుండి వస్తోన్న 'భీష్మ' సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఆ అంచనాలు లేటెస్ట్‌గా విడుదలైన పోస్టర్స్‌తో నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరాయి. ఓ పోస్టర్‌లో యాక్షన్‌ సీక్వెన్‌ చూపించారు. ఈ యాక్షన్‌ స్టిల్‌ని దగ్గరగా అబ్జర్వ్‌ చేస్తే, మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఖలేజా'లోని యాక్షన్‌ సీన్‌ని తలపిస్తోంది. ఇక ఇంకో స్టిల్‌లో కూల్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ ఉంది. ఈ రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా కాపీ కొట్టినట్లుగానే కనిపిస్తోంది. రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'గీత గోవిందం'లో స్టిల్‌ని తలపిస్తోంది.

 

స్టిల్స్‌ బాగున్నా, కాపీ స్టిల్స్‌లా ఉన్నాయంటూ నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 'ఛలో' ఫేమ్‌ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. డిశంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్‌ స్టిల్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ పాజిటివ్‌ ఒపీనియన్‌తో ఉన్నా, కాపీ అనే ఫీలింగ్‌ మరో పక్కన దొలిచేస్తోంది.

 

సో తర్వాత రాబోయే స్టిల్స్‌లో అయినా 'భీష్మ' టీమ్‌ ఆ ఫీలింగ్‌ని స్కిప్‌ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, రష్మికా మండన్నాకి ఈ దీపావళి డబుల్‌ ధమాకా అని చెప్పాలి. దీపావళి సందర్భంగా 'భీష్మ' స్టిల్‌తో పాటు, ఆమె నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ..' నుండి కూడా ఓ సూపర్బ్‌ స్టిల్‌ రిలీజ్‌ చేశారు. రెండింట్లోనూ రష్మికా ట్రెడిషనల్‌ వేర్‌లో కూల్‌ అప్పీల్‌ ఇస్తుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS