రామ్‌చరణ్‌ లెక్కలు పక్కాగా వున్నాయ్‌!

మరిన్ని వార్తలు

హీరోగా తాను చేసే సినిమాలపైనా, నిర్మాతగా చేయనున్న సినిమాలపైనా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లెక్కలు పక్కాగా వున్నాయ్‌. హీరోగా, నిర్మాతగానే కాదు.. తనయుడిగా తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించిన విషయాలపైనా రామ్‌చరణ్‌కి చాలా బాధ్యతలున్నాయ్‌. ఇవే కాదు, బాబాయ్‌ విషయంలోనూ, బాబాయ్‌ తనయుడు అకిరా విషయంలోనూ, బాబాయ్‌ కుమార్తె ఆద్య విషయంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, రామ్‌చరణ్‌కి బరువు బాధ్యతలు చాలా చాలా ఎక్కువే.

 

బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ సొంత బ్యానర్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌లో హీరోగా తాను ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్‌. పేరుకే పవన్‌ కళ్యాణ్‌ నిర్మాత, అక్కడా నిర్మాణ వ్యవహారాలు చరణే చూసుకుంటే ఆ సినిమా చేయాల్సి వస్తుందన్నమాట. మరోపక్క, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌లో, పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకిరానందన్‌నీ చరణ్‌ పరిచయం చేయబోతున్నాడు. డైరెక్ట్‌గా చెప్పలేదుగానీ, ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చరణ్‌ సంకేతాలు ఇచ్చేశాడు.

 

ఇక, మెగాస్టార్‌ చిరంజీవితో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చరణ్‌ నిర్మించనున్న సంగతి తెల్సిందే. సినిమా లాంఛనంగా ఆల్రెడీ ప్రారంభమయిపోయింది. త్వరలో సెట్స్‌ మీదకు వెళుతుంది. మరోపక్క, 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా షూటింగ్‌ బిజీగా వున్న చరణ్‌, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తాడు. ఈ విషయాన్నీ తన తాజా ఇంటర్వ్యూలో చరణ్‌ చెప్పాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS