యంగ్ హీరో నితిన్ చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి 'భీష్మ' కాగా, ఇంకోటి 'రంగే దే'. ముచ్చటగా మూడో సినిమా కోసం నితిన్ ప్రయోగం చేస్తున్నాడు. వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటితో నితిన్ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదరంగం నేపథ్యంలో సాగే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది. చదరంగం అంటేనే టఫ్ గేమ్, మైండ్ గేమ్. సో ఈ ఆటతో ఖచ్చితంగా ఏదో మెస్మరైజ్ చేయనున్నాడనుకోవాలి చంద్రశేఖర్ యేలేటి. ఆయన సినిమాలు అంత ఆషా మాషీగా ఉండవు.
నితిన్‌ని సమ్‌థింగ్ డిఫరెంట్‌గా చూపించడంతో పాటు, కాన్సెప్ట్‌ని టేకప్ చేయడంలోనూ తన మార్కు చూపిస్తాడనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఇకపోతే మొదటి రెండు సినిమాలకూ ఎలాగూ టైటిల్స్ ఫిక్సయిపోయాయి. ఇక ఈ సినిమాకి మాత్రం 'చదరంగం' అనే టైటిల్ వాడుకలో ఉంది. కథకి తగ్గట్లుగా ఈ టైటిల్ అయితే బాగుంటుందనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
ఓ పక్క 'భీష్మ' సినిమాలో నటిస్తూనే, మరోపక్క ఈ సినిమానీ సమాంతరంగా కానిచ్చేస్తున్నాడు నితిన్. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్‌ని ఫుల్ ఫిల్ చేసేందుకే బిజీగా సైన్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాడట నితిన్. అంటే, వీలైనంత తక్కువ టైంలోనే నితిన్ నుండి వరుస సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు 'భీష్మ' డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.