నితిన్‌ మనసు దోచుకున్న ఆ తెలుగమ్మాయ్‌ ఎవరబ్బా.?

మరిన్ని వార్తలు

గత కొంతకాలంగా యంగ్‌ హీరో నితిన్‌ ఓ తెలుగమ్మాయ్‌తో లవ్‌లో ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్‌ లవ్‌ని వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారట. త్వరలోనే వీరిద్దరినీ పెళ్లితో ఒకటి చేయాలని అనుకుంటున్నారట. స్వదేశీ భామతో నితిన్‌ లవ్‌లో పడినా, వివాహం మాత్రం విదేశాల్లో జరగనుందట. దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌ వీరి పెళ్లికి వేదిక కానుందని తెలుస్తోంది. అత్యంత ముఖ్యమైన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నితిన్‌ వివాహం ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైద్రాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌కి ప్లానింగ్‌ చేస్తున్నారట.

 

అయితే, నితిన్‌ పెళ్లి వార్తలో నిజమెంత.? అసలింకీ నితిన్‌ మనసు దోచుకున్న ఆ తెలుగమ్మాయ్‌ ఎవరు.? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌ని దొలిచేస్తున్నాయి. మరి, ఫ్యాన్స్‌ని డైలమాలో పడేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, నితిన్‌ పెదవి విప్పాల్సిందే. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా నితిన్‌ని అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలతో వేధిస్తున్నారట. మరి, ఆ ప్రశ్నల నుండి రిలాక్స్‌ అవ్వాలంటే, నితిన్‌ తన లవ్లీ గాళ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేయక తప్పదు మరి. మరోవైపు నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న లవ్‌లీ ఎంటర్‌టైనర్‌ 'భీష్మ' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రష్మికా మండన్నా ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS