పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని యంగ్ హీరో నితిన్. తన సినిమాలో ఎక్కడో చోట, ఏదో ఒక రకంగా పవన్ ప్రస్థావన, పవన్ మ్యానరిజం ఉండేలా చూసుకుంటాడు. అవసరం అనుకుంటే, ఏకంగా పవన్ కళ్యాణ్ సాంగ్స్ కూడా రీ మిక్స్ చేసేస్తుంటాడు. అయితే, పూర్తిగా పవన్‌ని అనుకరిస్తూ చేసిన ప్రతిసారీ నితిన్ బోర్లా పడ్డాడు. 'లై' టీజర్ చూస్తే, అది పవన్ సినిమా టీజర్‌నా,? నితిన్ సినిమా టీజర్‌నా? అనేలా డిజైన్ చేసి అంచనాలు పెంచేశాడు. కానీ, తీరా సినిమా విడుదలయ్యాకా నితిన్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఆ తర్వాత వచ్చిన 'ఛల్ మోహన్‌రంగా'లో కూడా నితిన్, తన మేనరిజమ్, బాడీ లాంగ్వేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని బాగా అనుకరించేశాడు.
దురదృష్టవశాత్తూ, ఈ రెండు సినిమాలూ నితిన్‌కి నెగిటివ్ రిజల్ట్‌నే ఇచ్చాయి. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 'భీష్మ'లోనూ అదే ఫ్లేవర్ కనిపిస్తోంది. హీరోయిన్ టీజింగ్.. అందులోనూ ఆ నడుము టీజింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణే కదా. ఆ నడుము సెంటిమెంట్‌నే తన ఫస్ట్ గ్లింప్స్‌గా రిలీజ్ చేసి, నితిన్ సక్సెస్ అయ్యాడు. మరి, రిలీజ్ తర్వాత కూడా రిజల్ట్ సక్సెస్ జోష్ అందిస్తుందా? ఏమో విడుదల తర్వాత కానీ మాట్లాడుకోలేం. మొత్తానికి 'భీష్మ' బోణీ అయితే బాగుంది. ఫస్ట్ గ్లింప్స్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, సినిమా4 రిలీజ్ కోసం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఈ ఏడాదిలోనే వస్తాడనుకున్న 'భీష్మ', వచ్చే ఏడాది ఫిబ్రవరికి జారుకున్నాడు. ఫిబ్రవరి 21న 'భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. క్రేజీ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.