'బాహుబలి'లో ప్రబాస్ డ్యూయల్ రోల్ చేశాడు. అంతకు ముందు 'బిల్లా'లోనూ ప్రబాస్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. 'బిల్లా' యావరేజ్ హిట్ ఖాతాలోకి వెళితే, 'బాహుబలి' సంగతి తెలిసిందే కదా. వరల్డ్ వైడ్‌గా సంచలనాలు సృష్టించేసింది. ఇప్పుడీ ముచ్చట ఎందుకు గుర్తు చేసుకోవల్సి వస్తోందంటే, ప్రస్తుతం ప్రబాస్ 'జాన్' సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్‌డేట్ రాకపోయినా, గాసిప్ రూపంలో ఓ కొత్త అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో ప్రబాస్ డబుల్ రోల్ పోషిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. 'బాహుబలి' మాదిరి తండ్రి కొడుకుల పాత్రలనీ అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే, ప్రబాస్ ఫ్యాన్స్‌కిది డబుల్ ధమాకానే. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. ఇటీవల 'సాహో' ఇచ్చిన షాక్‌కి 'జాన్'పై అంచనాలు లోప్రొఫైల్‌లో మెయింటైన్ చేయాలనుకుంటున్నారట. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ, డార్లింగ్ లుక్స్‌తో ప్రబాస్ ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది.