నితిన్‌ ఈసారైనా అవునని అంటాడా?

By iQlikMovies - June 11, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

నితిన్‌ దాదాపు 10 నెలలుగా రెస్ట్‌ తీసుకుంటున్నాడు. చేయాల్సిన ప్రాజెక్టులు చేతిలో ఉన్నా, ఒక్కదాన్నీ పట్టాలెక్కించడం లేదు. ఇదిగో ఈ సినిమా సెట్స్‌ మీదికెళుతుంది. అదిగో ఆ సినిమా సెట్స్‌ మీదికెళుతుందంటూ వార్తలు వినబడడమే కానీ, ఏ సినిమానీ సెట్స్‌ మీదికి తీసుకెళ్లడం లేదీ యంగ్‌ హీరో. పోనీలే, ఆ నోటా ఈ నోటా విని ఆ వార్తల్ని ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తారులే అనుకుంటే, తూచ్‌ అదంతా ఉత్తదే అని అన్నింటినీ ఖండించి పారేయడం మొదలెట్టాడీ మధ్య నితిన్‌. 'అఆ' సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కానీ, తర్వాత ఆ హిట్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాత వచ్చిన సినిమాలతో వరుసగా ఫ్లాపులే మిగిల్చాడు.

 

దాంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని, ఇక ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేస్తానంటున్నాడు. అబ్బో చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అఫీషియల్‌గా అన్నింటినీ అనౌన్స్‌ చేసేశాడు కూడా. కానీ వెరీ లేటెస్ట్‌ సమాచారం ప్రకారం వెంకీ కుడుముల దర్శకత్వంలోని సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట. బుధవారం ఆ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందనీ తెలుస్తోంది. 'భీష్మ' అనే టైటిల్‌ని ఈ సినిమాకి కన్‌ఫామ్‌ చేశారు. క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. చూడాలి మరి ఈ సారైనా నితిన్‌ అవునంటాడా.? లేక ఇది కూడా తూచ్‌ అబద్ధమే అని ఖండించేస్తాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS