హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి 'చదరంగం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఇక 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తోన్న 'భీష్మ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటివలే మొదలయ్యాయి. ఇక ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. కాగా 'ఛలో' మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం.
ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టారు. మరి ఈ చిత్రంతోనైనా నితిన్ ఆశించిన హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.