అరె మహేష్ అప్పుడే అంత పూర్తి చేశాడా?

మరిన్ని వార్తలు

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - సూపర్ స్టార్ మహేష్ బాబు' కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చిన్న చిన్న సీన్స్ తప్ప మొత్తం షూటింగ్ పూర్తయింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపు మహేష్ తన పాత్రకు సంబందించిన సీన్స్ పూర్తి చేసాడట. ఇక కేవలం చిన్న బ్యాలెన్స్ సీన్స్ మాత్రమే ఉన్నాయట. మొత్తానికి మహేష్ అప్పుడే పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

 

ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పోరాటాలు చిత్రీకరించింది. ఇక కేవలం కొన్ని సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ చేయాల్సి వుంది. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది బండ్ల గణేషేనట. ఒకరకంగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్, అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో... ఈ సినిమాలో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట. ఇక బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది. ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే రైలు సీక్వెన్స్ సినిమాలోనే చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.

 

ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS