'తొలి ప్రేమ'తో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. మరుసటి సినిమా అఖిల్‌తో చేశాడు. 'మజ్ను' యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. అయితే... వెంకీకి అవకాశాలు రావడం మాత్రం మానలేదు. తాజాగా నితిన్‌తో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథ ఓకే అయిపోయింది. ప్రస్తుతం నితిన్ 'భీష్మ' చేస్తున్నాడు.
ఈ సినిమాతో పాటే సమాంతరంగా వెంకీ అట్లూరి సినిమా కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి. కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలిస్తున్నారు. తమిళంలో కీర్తి బిజీగా ఉండడం వల్ల, తెలుగు సినిమాలపై కీర్తి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే వెంకీ అట్లూరి చెప్పిన కథ, సితార ఇస్తానన్న పారితోషికం రెండూ నచ్చడంతో ఈ ప్రాజెక్టుపై సంతకాలు చేసేసినట్టు తెలుస్తోంది. నితిన్ - కీర్తి జోడి కూడా చూడ్డానికి బాగానే ఉంటుంది. సో.. ఈ కాంబో సెట్టయితే... టాలీవుడ్‌కి మరో కొత్త జోడీ దొరికేసినట్టే.