ఫ్రాన్స్‌ చెక్కేసిన 'రౌడీ' అండ్‌ టీమ్‌!

By iQlikMovies - June 03, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

రౌడీ స్టార్‌గా పాపులర్‌ అయిన విజయ్‌ దేవరకొండ ఫ్రాన్స్‌లో సందడి చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కోసం విజయ్‌ దేవరకొండ, టీమ్‌తో కలిసి ఫ్రాన్స్‌ చెక్కేశాడు. అక్కడే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్‌ జరగనుందట. త్రీ బ్రేకప్‌ లవ్‌ స్టోరీల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. సో ఫ్రాన్స్‌ లొకేషన్స్‌లో రొమాంటిక్‌ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారట. గతంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'ఆరెంజ్‌' తరహా కాన్సెప్ట్‌లో ఈ సినిమా ఉండబోతోందట.

 

అయితే, ఆరెంజ్‌ రామ్‌చరణ్‌కి వర్కవుట్‌ కాలేదు. కానీ మనోడు మాంచి స్వింగ్‌లో ఉన్నాడిప్పుడు. రొమాంటిక్‌ స్టోరీలకైతే, ఇక విజయ్‌ దేవరకొండ స్టామినా ఇలా ఇలా లేదు. డైరెక్టర్‌ యాంగిల్‌ నుండి తీసుకుంటే, క్రాంతి మాధవ్‌లో ఓ మ్యాజిక్‌ ఉంది. సింపుల్‌గా లవ్‌స్టోరీస్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ చేసేస్తాడు. ఊహించని ఫీల్‌నీ, థ్రిల్‌నీ క్రియేట్‌ చేస్తాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఆయన టేకింగ్‌పై ఓ ఐడియా ఉంటుంది.

 

అలాంటిది ప్రామిసింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో తెరకెక్కిస్తున్న తాజా సినిమాతో క్రాంతి మాధవ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయనున్నాడో చూడాలిక. ఈ సినిమా కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు విజయ్‌తో రొమాన్స్‌కి సిద్ధంగా ఉన్నారు. వారే రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్‌, ఇసాబెల్లే. ఈ సినిమాకి 'బ్రేకప్‌' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రష్మికా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS